Collector తొలిరోజు ప్రశాంతం

ABN, Publish Date - Mar 18 , 2025 | 12:00 AM

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 104 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. 21,393 మంది విద్యార్థులకుగాను 21,083 మంది పరీక్షలు రాశారు. 210 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు.

Collector తొలిరోజు ప్రశాంతం
ఎనుములపల్లిలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌

పది పరీక్షలకు 210 మంది గైర్హాజరు

కొత్తచెరువు/పుట్టపర్తిటౌన, మార్చి 17(ఆంరఽధజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 104 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. 21,393 మంది విద్యార్థులకుగాను 21,083 మంది పరీక్షలు రాశారు. 210 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. అయితే, కొత్తచెరువు బాలికల ఉన్నత పాఠశాలలో 15 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. బదులుగా విద్యార్థులకు 15 నిమిషాల పరీక్ష సమయాన్ని పొడిగించారు.

జిల్లా కేంద్రంలోని ఎనుములపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ టీఎస్‌ చేతన, ఎస్పీ రత్న పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తాగునీరు, వైద్యశిబిరాన్ని పరిశీలించి, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్‌ వెంట డిపార్టుమెంట్‌ అధికారి జయసింహారావు, పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌ గోపాల్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 12:00 AM