Contract faculty కళాశాలలనూ ఒంటిపూటే నిర్వహించాలి
ABN, Publish Date - Mar 26 , 2025 | 12:38 AM
వేసవి కాలం దృష్ట్యా ఉదయం పూట మాత్రమే జూనియర్ కళాశాలలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు కోరారు.

ధర్మవరం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వేసవి కాలం దృష్ట్యా ఉదయం పూట మాత్రమే జూనియర్ కళాశాలలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఒప్పంద అధ్యాపకుల సంఘం నాయకులు కోరారు. మంగళవారం ఈ మేరకు డీఐఈఓ రఘునాథరెడ్డికి వినతిపత్రం ఇచ్చిన వారు మాట్లాడారు. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని, వేసవికాలంలో అధ్యాపకులు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని, కావున కళాశాల తరగతులను మధ్యాహ్నం వరకే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇందులో ఆ సంఘం జిల్లా నాయకులు పెద్దన్న, కేశవరెడ్డి, హఫీజ్‌ఖాన, శంకరప్ప, సుజాత, లలిత, క్రిష్ణయ్య, రంగారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Mar 26 , 2025 | 12:38 AM