MPP ఎంపీపీ భూముల ఆక్రమణపై ఫిర్యాదు
ABN, Publish Date - Mar 28 , 2025 | 12:26 AM
ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణయాదవ్ గిరిజన భూముల ఆక్రమణపై ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన సభ్యుడు జఠాతహుస్సేననాయక్‌కు గురువారం ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస నాయక్ తెలిపారు.

జాతీయ ఎస్టీ కమిషన సభ్యుడికి ఫిర్యాదు చేస్తున్న నాయకులు
ఓబుళదేవరచెరువు, మార్చి 27(ఆంధ్రజ్యోతి) : ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణయాదవ్ గిరిజన భూముల ఆక్రమణపై ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన సభ్యుడు జఠాతహుస్సేననాయక్‌కు గురువారం ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస నాయక్ తెలిపారు. ఆదినారాయణయాదవ్ గిరిజనుల భూముల అక్రమణలు, దౌర్జాలన్యాలను వివరించినట్లు తెలిపారు. గిరిజన భూములను ఆక్రమించిన ఎంపీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఆయనతో పాటు రవీంద్రనాయక్, నరే్‌షనాయక్, బునాయక్ ఉన్నారు.
Updated Date - Mar 28 , 2025 | 12:26 AM