కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:45 AM
కూట మి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నయక్కలూరు, తురకపల్లి, కొండాపురం గ్రామాల్లో బుధవారం ఆయన గ్రామసభలు నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధానంగా సాగు, తాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయం గా పని చేస్తున్నామన్నారు.
-ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి
పెద్దపప్పూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నయక్కలూరు, తురకపల్లి, కొండాపురం గ్రామాల్లో బుధవారం ఆయన గ్రామసభలు నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధానంగా సాగు, తాగునీటి సమస్యల పరిష్కారమే ధ్యేయం గా పని చేస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజుల్లోనే అనేక అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. తర్వాత గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్నయక్కలూరులో పలువురి గ్రామస్థులకు ఇంటిపట్టాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాలాజీరాజు, ఎంపీడీఓ శకుంతల, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు తాతిరెడ్డి లోకనాథరెడ్డి, మాజీ ఎంపీపీ బీసీ రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గుర్తి రఘునాయుడు, నాయకులు శశిధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కూచి సాయిమోహన, ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jan 09 , 2025 | 01:45 AM