cricket ఉత్సాహంగా క్రికెట్ పోటీలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:53 AM
స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో పోలీసులు, పాత్రికేయుల మధ్య శుక్రవారం క్రికెట్ మ్యాచ ఉత్సాహంగా సాగింది

బత్తలపల్లి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో పోలీసులు, పాత్రికేయుల మధ్య శుక్రవారం క్రికెట్ మ్యాచ ఉత్సాహంగా సాగింది. పాత్రికేయుల జట్టుకు అజయ్, పోలీస్ జట్టుకు సుదర్శన ప్రాతినిథ్యం వహించారు. టాస్ గెలిచిన పాత్రికేయుల జట్టు మొదట బ్యాటింగ్ చేసి .. 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 9.3 ఓవర్లలోనే ఎనిమిది వికెట్లు నష్టపోయి 79 పరుగులు చేసి విజయం సాధించింది. పాత్రికేయుల జట్టులో వెంకట దర్శన, పోలీస్ జట్టులో సుదర్శనకు బెస్ట్ ప్లేయర్ అవార్డులను ఎస్‌ఐ సోమశేఖర్ అందజేశారు.