ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:00 AM
పోరాట యోధుడు వడ్డె ఓబన్న 218వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో సైతం వేడుకలను జరిపారు. వడ్డెర కులస్థులతో పాటు పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఓబన్న విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్: పోరాట యోధుడు వడ్డె ఓబన్న 218వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో సైతం వేడుకలను జరిపారు. వడ్డెర కులస్థులతో పాటు పలు పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఓబన్న విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న సేవలు అనిర్వచనీయమని తెలిపారు. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటీ్‌షవారిపై తిరుగుబాటు చేశారని కొనియాడారు. ఆయన్న స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామంటూ పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఓబన్నకు నివాళులర్పించారు. మరుగునపడ్డ అనేకమంది వీరులను సీఎం చంద్రబాబు సమాజానికి పరిచయం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఓబన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. బీసీలను గుర్తించి, ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. గుత్తిలోని ఎన్టీఆర్ సర్కిల్‌వద్ద ఉన్న వడ్డే ఓబన్న విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వడ్డెర్ల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్, రాజీవ్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jan 12 , 2025 | 01:00 AM