ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందాలి

ABN, Publish Date - Jan 03 , 2025 | 11:33 PM

వన హాస్పిటల్‌ వన విలేజ్‌లో ప్రతిఒక్కరికీ ఉచితంగా వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టరు వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయుష్మానభారతపై శుక్రవారం ఆయన సమీక్షించారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టరు వినోద్‌కుమార్‌

వైద్యఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టరు వినోద్‌కుమార్‌

అనంతపురం టౌన, జనవరి 3(ఆంధ్రజ్యోతి): వన హాస్పిటల్‌ వన విలేజ్‌లో ప్రతిఒక్కరికీ ఉచితంగా వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టరు వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయుష్మానభారతపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టరు మాట్లాడుతూ ఆయుష్మాన భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 6,76,813మందిని ఎనరోల్‌ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికి 6, 27,041మందిని నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏఎనఎంల ద్వారా వందశాతం పూర్తి చేయించాలన్నారు. అసిస్టెంట్‌ కలెక్టరుతో సమన్వయం చేసుకొని మండలాల సిబ్బందితో వీడియోకాన్ఫరెన్సలు, సమావేశాలు పెట్టుకొని లక్ష్యం పూర్తిచేయాలన్నారు. ఆయుష్మాన భారతకార్డుకు సంబంధించి ప్రత్యేకంగా ఎనరోల్‌మెంట్‌ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉచిత వైద్యసేవలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవల గ్రీవెన్సకమిటీని నాలుగునెలలకు ఓసారి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వన హాస్పిటల్‌ వనవిలేజ్‌లో ఫ్రీహెల్త్‌ చెకప్‌ చేసేవిధంగా చూడాలన్నారు. జిల్లాలోని ఆస్పత్రులలో ఎన్టీఆర్‌ వైద్యసేవలో జరిగే ప్రసవాల వివరాలను విధిగా నమోదు చేయాలన్నారు. ఎన్టీఆర్‌ వైద్యఆరోగ్యశ్రీ సేవల ద్వారా వచ్చే పారితోషికం నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టరు వినూత్న, ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టరు కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీహెచఎ్‌స డాక్టరు రవికుమార్‌, డీపీఎం డాక్టరు రవిశంకర్‌, డెమో త్యాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:33 PM