kadiri ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన
ABN, Publish Date - Mar 20 , 2025 | 12:18 AM
కదిరి లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ధర్మవరానికి చెందిన కళాకారుల భరత, కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రశంసాపత్రాలు అందుకున్న ధర్మవరం నాట్యకళాకారులు
ధర్మవరం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): కదిరి లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ధర్మవరానికి చెందిన కళాకారుల భరత, కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. లలిత కళానికేతన నాట్యగురువులు బాబూబాలాజీ, రామలలిత్య శిష్యబృందం 20 మంది పాల్గొని నరసింహస్వామి చరితం, ప్రహ్లాద పట్టాభిషేకం తదితర ఘట్టాలను నాట్యరూపంలో ప్రదర్శించారు. ఆలయ ఈఓ శ్రీనివాసులు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
Updated Date - Mar 20 , 2025 | 12:19 AM