Investigation ముదిగుబ్బ ఎంపీపీపై విచారణ

ABN, Publish Date - Mar 22 , 2025 | 12:37 AM

ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణయాదవ్‌, ఆయన కుటుంబ సభ్యుల భూ కబ్జాపై పార్టీ కమిటీ వేసిందని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూకల మధుకర్‌జీ స్పష్టం చేశారు.

Investigation ముదిగుబ్బ ఎంపీపీపై విచారణ
మధుకర్‌జీకి వినతి పత్రం ఇస్తున్న బాధితులు

పుట్టపర్తిటౌన, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణయాదవ్‌, ఆయన కుటుంబ సభ్యుల భూ కబ్జాపై పార్టీ కమిటీ వేసిందని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నూకల మధుకర్‌జీ స్పష్టం చేశారు. ముదిగుబ్బ మండలంలోని అడవిబ్రాహ్మణపల్లి తండాకు చెందిన గిరిజనులు పుట్టపర్తిలోని బీజేపీ కార్యాలయంలో మధుకర్‌జీని శుక్రవారం కలిశారు. తాము వందల సంవత్సరాలుగా సాగు తాము చేసుకొంటున్న భూములను ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణయాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు కబ్జా చేశారని వాపోయారు. స్పందించిన ఆయన ఈ విషయంపై పార్టీ కమిటీ వేసిందని, కమిటీ, ఆర్డీఓ రిపోర్టు వచ్చిన తరువాత మంత్రి సత్యకుమార్‌తో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బంజార గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసనాయక్‌, నాయకులు క్రిష్ణనాయక్‌, అమర్‌, ఆంజి, బాలు, రవీంద్ర, బీమ్లానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 12:37 AM