SKU : ఎస్కేయూ విద్యార్థులకు ఉద్యోగాలు

ABN, Publish Date - Mar 25 , 2025 | 12:16 AM

శ్రీచైతన్య పాఠశాలల ఉపాధ్యాయులుగా ఎస్కేయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈ మేరకు సోమవారం ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ అనిత, రిజిస్ర్టార్‌ రమే్‌షబాబు విద్యార్థులకు నియామక పత్రాలందజేసి అభినందించారు.

SKU : ఎస్కేయూ విద్యార్థులకు ఉద్యోగాలు
In-charge VC Anitha with the selected students

అనంతపురం సెంట్రల్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): శ్రీచైతన్య పాఠశాలల ఉపాధ్యాయులుగా ఎస్కేయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈ మేరకు సోమవారం ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ అనిత, రిజిస్ర్టార్‌ రమే్‌షబాబు విద్యార్థులకు నియామక పత్రాలందజేసి అభినందించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విద్యాసంస్థలున్న శ్రీచైతన్యలో అకడమిక్‌ టీచర్స్‌, డీన్స, ప్రిన్సిపాల్‌ వంటి పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, గణితం అభ్యసించిన విద్యార్థులతో బీఈడీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు చేపట్టామని తెలిపారు. మొత్తం 123మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా ప్రతిభ కనబర్చిన 56మంది ఎంపికయ్యారని, వీరందరికీ నియామక పత్రాలందజేశామని వివరించారు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.21వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు. శ్రీచైతన్య ఏజీఎం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్‌ వెంకటనాయుడు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ కె.అనిత, ప్రిన్సిపాల్స్‌ ఇషాద్‌వలి, రాధాకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:16 AM