Share News

government colleges ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:56 AM

ప్రభుత్వ కళాశాలలోనే చేరా లని.. నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులను ప్రభుత్వం కల్పి స్తోందని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని.. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాల అధ్యాపకులు కోరుతున్నారు.

government colleges  ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి
చిన్నపరెడ్డిపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న అధ్యాపకులు

ధర్మవరం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కళాశాలలోనే చేరా లని.. నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులను ప్రభుత్వం కల్పి స్తోందని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని.. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాల అధ్యాపకులు కోరుతున్నారు. ఈ మేర కు అధ్యాపకులు రామాంజనరెడ్డి, పెద్దన్న, మల్లికార్జున, హాజీపీరా, ఈక్రంబాషా, ప్రభాకర్‌ చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, కనుమక్కల, చిన్నపరెడ్డిపల్లి గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలలో చేరితే మధ్యాహ్న భోజనం, యూనీఫాం, పాఠ్యపుస్తకాలు.. తదితర సౌకర్యాలు అభిస్తా యని, ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలకు ధీటుగా మంచి ఉత్తీర్ణత శాతం వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:56 AM