ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Layers శేషాద్రి కేసును సీఐడీకి ఇవ్వాలి

ABN, Publish Date - Jan 03 , 2025 | 11:35 PM

సీనియర్‌ న్యాయవాది శేషాద్రి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. అనంతపురం బార్‌ అసోసియేషన ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోర్టు వద్ద నుంచి క్లాక్‌ టవర్‌ మీదుగా డీఐజీ కార్యాలయం వరకు వెళ్లారు.

డీఐజికి సమస్య వివరిస్తున్న న్యాయవాదులు

డీఐజీకి న్యాయవాదుల వినతి

అనంతపురం క్రైం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ న్యాయవాది శేషాద్రి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. అనంతపురం బార్‌ అసోసియేషన ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోర్టు వద్ద నుంచి క్లాక్‌ టవర్‌ మీదుగా డీఐజీ కార్యాలయం వరకు వెళ్లారు. బార్‌ అసోసియేషన అధ్యక్షుడు గురుప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ తదితరులు డీఐజీ షిమోషికి వినతిపత్రం అందజేశారు. శేషాద్రి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. త్రీటౌన పోలీస్‌ స్టేషనలోని సీఐ చాంబర్‌లో ఏం జరిగిందో తేల్చాలని కోరారు. సీఐ శాంతిలాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శేషాద్రి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా అలసత్వం చేశారని డీఐజీకి వివరించారు. పోలీ్‌సస్టేషనలో మృతి చెందారనే అంశాన్ని చేర్చకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఒత్తిడి తెచ్చారని అన్నారు. సీఐతో పాటు శేషాద్రిపై చేయి చేసుకుని, దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్‌ న్యాయవాది విశ్వనాథరెడ్డి, విటల్‌, రాజారెడ్డి, గోవిందరాజులు, మంజుల, భాగ్యలక్ష్మి, శ్రీవాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని రోజుల పాటు విధులను బహిష్కరిస్తామని న్యాయవాదులు తెలిపారు.

Updated Date - Jan 03 , 2025 | 11:35 PM