MLA KANDIKUNTA: జగ్జీవనరామ్ ఆశయాలు కొనసాగిద్దాం
ABN, Publish Date - Apr 05 , 2025 | 11:55 PM
స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత బాం ధవుడు, ఆదర్శ పార్లమెంటేరియన బాబు జగ్జీవనరామ్ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.

కదిరి, ఏప్రిల్5 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత బాం ధవుడు, ఆదర్శ పార్లమెంటేరియన బాబు జగ్జీవనరామ్ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ బంగ్లాలో జగ్జీవనరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఆదర్శవంతుడా జగ్జీవనరామ్‌ను స్మరించుకుంటున్నామంటే ఆయనజీవితం ఎంత ఆదర్శమైందో అర్థమవుతోందన్నారు. కౌన్సిలర్ ఆల్ఫాముస్త ఫా, నాయకులు రాజశేఖర్‌బాబు, శేషు, జయరామ్, విశ్వనాథ్, ఆంజనేయు లు, చైతన్య, చంద్రశేఖర్, రాము, నాగేంద్రనాథ్, ప్రేమలత పాల్గొన్నారు.
Updated Date - Apr 05 , 2025 | 11:55 PM