Minister వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:04 AM
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు.

తాడిమర్రి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్యసేవలందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్ప ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. అనంతరం డాక్టర్లు, రోగులతో మాట్లాడి రోగులకు వైద్యసేవలు అందించాలని డీఎం అండ్ హెచఓ పైరోజ్ బేగంకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ, తహసీల్దార్ బాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ రంగారావు, డాక్టర్ హరిత, టీడీపీ మండల కన్వీనర్ కూచి రాము, బీజేపీ మండల కన్నీనర్ దేవర రాము, నిడిగల్లు సర్పంచ గోనుగుంట్ల భూషణ్, నాయకులు హర్ష, అశ్వర్థు, చంద్ర, విశ్వనాథ్, కేశవరెడ్డి పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
ధర్మవరం :నియోజకవర్గంలోని 20 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.18,81,558 మంజూరైంది. అందుకు సంబం ధించిన చెక్కులను మంత్రి సత్యకుమార్ ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు అందజేశారు.