Minister Satya kumar సీమకు నీరివ్వడానికి కృషి: మంత్రి
ABN, Publish Date - Mar 16 , 2025 | 12:15 AM
మండలంలోని మలకవేములక్రాస్ వద్ద హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...ధర్మవరం నియోజకవర్గం సహా రాయలసీమ ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తోందన్నారు.
హంద్రీనీవా లైనింగ్ పనులకు శంకుస్థాపన
ముదిగుబ్బ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని మలకవేములక్రాస్ వద్ద హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...ధర్మవరం నియోజకవర్గం సహా రాయలసీమ ప్రజలకు తాగు, సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తోందన్నారు. రూ.936.7కోట్లతో హంద్రీనీవా మెయిన కెనాల్ లైనింగ్ పనులు చేపట్టామన్నారు. పట్నం వరకు 184 కిలోమీటర్ల మెయిన కెనాల్ లైనింగ్ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన తరువాత కాలువ ద్వారా నీటి సరఫరా మరింత మెరుగువుతుందన్నారు. పుంగనూరు బ్రాంచ కెనాల్ పట్నం నుంచి తనకల్లు మండలంలోని కొక్కంటిక్రాస్ వరకు 75 కిలోమీటర్ల లైనింగ్ పనులను రూ.319.6కోట్ల వ్యయంతో చేపడుతున్నామన్నారు. ఈ పనులను త్వరగా పూరిర్తీ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ, ప్రాజెక్టు మేనేజర్ వెంకటరావు, బీజేపీ మండల అధ్యక్షుడు అంజనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 16 , 2025 | 12:15 AM