Mp ambika ఆరోగ్యకర సమాజం కోసం కృషి
ABN, Publish Date - Jan 06 , 2025 | 12:36 AM
ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక జేఎనటీయూ మైదానంలో ఆదివారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు.
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
అనంతపురం క్లాక్‌టవర్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన సమాజ స్థాపన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక జేఎనటీయూ మైదానంలో ఆదివారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతో దోహదపడుతాయన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు అథ్లెటిక్ పోటీలకు హాజరుకావడం శుభపరిణామమన్నారు. అనంతరం పరుగు, స్పీడ్ వాక్ పోటీలు ఆసక్తిగా సాగాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.కార్యక్రమంలో జేఎనటీయూ వీసీ సుదర్శనరావు, ఎస్కేయూ రిజిసా్ట్రర్ రమే్‌షబాబు, మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా అసోసియేషన అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్ బాబు, సికందర్, ఎస్కేయూ మాజీ రిజిసా్ట్రర్ సుధాకర్‌బాబు, డాక్టర్ కొండయ్య, బార్‌అసోసియేషన అధ్యక్షుడు గురుప్రసాద్, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, అర్బనబ్యాంకు మాజీ సీనియర్ మేనేజర్ వీజీ లోకనాథ్, మాస్టర్స్ అథ్లెటిక్స్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 06 , 2025 | 12:36 AM