Punish భూకబ్జాదారులను శిక్షించండి

ABN, Publish Date - Mar 25 , 2025 | 12:15 AM

జిల్లాలోని ముదిగుబ్బ మండలం అడవిబ్రాహ్మణపల్లి తండాలో ఎంపీపీ ఆదినారాయణయాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ భూములను కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకొని.. తిరిగి ఆ భూములు తమకు ఇప్పించాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

Punish  భూకబ్జాదారులను శిక్షించండి
కలెక్టరేట్‌ వద్ద గిరిజనులు, సీపీఐ నాయకుల నిరసన

పుట్టపర్తిటౌన, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ముదిగుబ్బ మండలం అడవిబ్రాహ్మణపల్లి తండాలో ఎంపీపీ ఆదినారాయణయాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ భూములను కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకొని.. తిరిగి ఆ భూములు తమకు ఇప్పించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ముందు సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో వారు ధర్నా చేశారు. గిరిజనుల భూములను ఎంపీపీ ఆయన బంధువులు అప్పనంగా రికార్డుల్లో ఎక్కించుకుని కాజేశారని చెప్పారు. ఇందుకు ఆర్టీవో, తహసీల్దార్‌ సహకరించారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐడీతో విచారణ చేయించి.. కేసు నమోదు చేయాలన్నారు. అనంతరం జేసీ అభిషేక్‌కుమార్‌కు వినతిపత్రం అందచేశారు. ఈకార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శ్రీనివాసనాయక్‌, క్రిష్ణానాయక్‌, రవీంద్రనాయక్‌, రమణనాయక్‌, రవిబాబు, వెంకటేష్‌, సీపీఐ నాయకులు కదిరప్ప, మధునాయక్‌, బాఽధిత గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:15 AM