Roads రహదారులు, వీధులు జలమయం
ABN, Publish Date - Apr 05 , 2025 | 12:26 AM
మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో వీధులు జలమయం అయ్యా యి.
కొండకమర్లలో గ్రామీణ బ్యాంక్ వద్ద నిల్వ ఉన్న వర్షపు నీరు
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో వీధులు జలమయం అయ్యా యి. మండల వ్యాప్తంగా 35.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండకమర్లలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు భారీగా ప్రవహించింది. దీంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంత వాసులు ఫిర్యాదుతో స్పందించిన కార్యదర్శి మద్దిలేటిరెడ్డి ఎక్స్‌కలేటర్‌తో వర్షపు నీటిని దారి మళ్లించారు. అలాగే అల్లాపల్లి గ్రామంలో సిమెంటు రోడ్డు తక్కువ ఎత్తులో ఉండటంతో వర్షపు నీరు నిలవడంతో ఆ ఆప్రాంత వాసులు ఇబ్బందులు పడ్డారు.
Updated Date - Apr 05 , 2025 | 12:26 AM