Telugu తెలుగును కాపాడుకుందాం
ABN, Publish Date - Jan 16 , 2025 | 12:04 AM
తెలుగు సాహితీ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని నక్కలపల్లికి చెందిన రైతు నారాయణ రెడ్డి అన్నారు.
భాషా ప్రేమికుడు నారాయణరెడ్డి
బెళుగుప్ప, జనవరి 15(ఆంధ్రజ్యోతి): తెలుగు సాహితీ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని నక్కలపల్లికి చెందిన రైతు నారాయణ రెడ్డి అన్నారు. ఆయన చదువుకున్నది 7వ తరగతి వరకే అయినా.. తెలుగు భాషా పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. తెలుగు పద్యాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. స్వగ్రామంలోని సీతారామ ఆలయంలో పోతన భాగవత సప్తాహం నిర్వహిస్తున్నారు. భాగవతం పుస్తకాలను ఉచితంగా పంచుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కడప, కర్నూలు జిల్లాలకు చెందిన భాషా ప్రేమికులు ఈ వేడుకలలో పాలు పంచుకుంటున్నారు. తెలుగు పద్యాలు ప్రతి ఒక్కరి నోటా వినపడాలని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామనారాయణరెడ్డి అన్నారు.
Updated Date - Jan 16 , 2025 | 12:04 AM