ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

mischievous ఆకతాయిల వికృత చేష్టలు

ABN, Publish Date - Apr 15 , 2025 | 12:17 AM

గత ఏడాది కురిసిన వర్షాలకు బీడు భూములు, రోడ్ల పక్క, కొండ ప్రాంతాల్లో గడ్డి విపరీతంగా పెరిగింది. మూగజీవాల మేతకు ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేత తినేవి. వేసవి కాలంలో ఎండు గడ్డి గొర్రెలకు ఎంతో సత్తువ ఇచ్చేది. అయితే ఆకతాయిలు బీడు భూములు, కొండలు, రోడ్ల పక్క పెరిగిన గడ్డికి నిప్పుపెడుతున్నారు.

ముదిగుబ్బలో కాలిపోతున్న బీడు భూముల్లోని గడ్డి

ముదిగుబ్బ, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): గత ఏడాది కురిసిన వర్షాలకు బీడు భూములు, రోడ్ల పక్క, కొండ ప్రాంతాల్లో గడ్డి విపరీతంగా పెరిగింది. మూగజీవాల మేతకు ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేత తినేవి. వేసవి కాలంలో ఎండు గడ్డి గొర్రెలకు ఎంతో సత్తువ ఇచ్చేది. అయితే ఆకతాయిలు బీడు భూములు, కొండలు, రోడ్ల పక్క పెరిగిన గడ్డికి నిప్పుపెడుతున్నారు. దీంతో ఆ ఎండు గడ్డి కాస్తా కాలిపోతోంది. దీంతో మేత లేక మూగజీవాలు విలవిల లాడుతున్నాయి. మండల వ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. వేల కుటుంబాలు మూగజీవాల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఆకతాయిలు బీడు భూముల్లోని గడ్డికి నిప్పుపెడుతుండటంతో ఎటుచూసినా గడ్డి కాలిపోయి.. భూములు మసిబారి కనిపిస్తున్నాయి. గొర్రెల మేత కోసం కాపర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇతర మండలాల నుంచి అధిక ధరకు వేరుశనగ కట్టిని కొనుగోలు చేసి ట్రాక్టర్లలో తెచ్చుకుంటున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:17 AM