Emergency Services: భవ్య హెల్త్ సర్వీ్‌సకు 104, 108 బాధ్యతలు
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:41 AM
ఆంధ్రప్రదేశ్‌లో 104, 108 అంబులెన్సుల నిర్వహణకు కొత్త సర్వీస్ ప్రొవైడర్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. 104 వాహనాల్లో 47 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు అందుబాటులోకి రానుండగా, 108 సేవల్లో అత్యవసర కాల్స్ రిసీవ్ చేయడం, గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేరడం వంటి షరతులు విధించారు.

కొత్త సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 104, 108 అంబులెన్సుల నిర్వహణకు ప్రభుత్వం కొత్త సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు సమస్యాత్మకంగా కొనసాగుతున్న 104, 108 సేవలకు జవసత్వాలు కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సారథ్యంలో ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామిగా ఉన్న కన్సార్షియంను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 104 వాహనాల ద్వారా గ్రామీణులకు 47 రకాల రోగ నిర్ధారణ(డయాగ్నోస్టిక్) పరీక్షలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎలకా్ట్రనిక్ హెల్త్ రికార్డులను రూపొందించడానికి ఈ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడానికి మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుతం 104 అంబులెన్స్‌ల ద్వారా కేవలం మధుమేహం, బీపీ పరీక్షలు మాత్రమే(ర్యాపిడ్ కిట్ ద్వారా) చేస్తున్నారు. దీనికి భిన్నంగా నూతన విధానంలో నిర్దిష్ట ఫలితాలనిచ్చే 47 రకాల పరీక్షలు చేయనున్నారు. బ్లడ్ గ్లూకోజ్, కాలేయ పనితీరు, కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్, మూత్ర విశ్లేషణ ఇలా 20 రకాల పరీక్షలు చేస్తారు. అదేవిధంగా నిర్దిష్ట వ్యాధులకు సంబంధించి మరో 27 పరీక్షలు చేస్తారు. కొత్తగా ఈ సేవల బాధ్యతలను స్వీకరించనున్న సర్వీస్ ప్రొవైడర్ సాధారణ 20 పరీక్షలను ఒక్కొక్కరికి రూ.195 ఖర్చుతో చేయడానికి అంగీకరించింది.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ముందు మొబైల్ మెడికల్ యూనిట్ల డేటా విశ్వసనీయతను తనిఖీ చేసేందుకు ఈ నిర్ధారణ పరీక్షలను పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టనుంది. ఈ పరీక్షలు నిర్వహించడానికి కొత్త ఏజెన్సీ ఆయా పరికరాల్ని ప్రతి 104 వాహనంలో సెమీ-ఆటోమెటిక్ బయోకెమిస్త్రీ ఎనలైజర్, సీబీసీ మెడిసిన్ 3 పార్ట్ ఎనలైజర్, మైక్రోస్కోప్, ఇంక్యుబేటర్ వంటి పరికరాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి వాహనంలో ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు.
108కి 2 షరతులు
కొత్త ఏజెన్సీ 190 కొత్త 108 వాహనాల్ని సొంతగా కొనుగోలు చేయనుంది. కొత్త వాహనాలు అందుబాటులోకి రావడంతో 731 వాహనాలు 108 సేవల్ని అందిస్తాయి. 108 సేవలకు సంబంధించి, సర్వీస్ ప్రొవైడర్‌కు రెండు షరతులు పెట్టారు. కాల్ వచ్చినప్పటి నుంచి రోగిని ఒక గంటలోపు ఆసుపత్రికి తీసుకెళ్లాలి. దీనిని గోల్డెన్ అవర్‌గా పేర్కొంది. రెండోది.. అత్యవసర కాల్స్‌ను తప్పకుండా రిసీవ్ చేసుకోవాలి. ప్రస్తుతం 108 సేవలు అందిస్తున్న సంస్థ రోజుకు దాదాపు 200 ఎమర్జేన్సీ కాల్స్‌ను నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ఈ షరతులు పెట్టడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..