AP jobs investment Boost: సీబీజీ ప్లాంట్లతో వలసలకు చెక్‌

ABN, Publish Date - Apr 03 , 2025 | 03:46 AM

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్‌ సహా అనేక కంపెనీలు 500 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాయి, దీని ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

AP jobs investment Boost: సీబీజీ ప్లాంట్లతో వలసలకు చెక్‌

కనిగిరిని ఆ ప్లాంట్ల హబ్‌గా మారుస్తాం

రాష్ట్రంలో 65 వేల కోట్లతో 500 ప్లాంట్లు

వాటి ద్వారా 2.50 లక్షల మందికి ఉద్యోగాలు

మొత్తం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

వైసీపీ పాలనలో పరిశ్రమలను వెళ్లగొట్టారు

అభివృద్ధిపై ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

మానుకోకపోతే రెడ్‌ బుక్‌లోకి ఎక్కిస్తా: లోకేశ్‌

రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్‌కు భూమిపూజ

ఒంగోలు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే తన ఏకైక లక్ష్యమని, అందుకోసం అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కృషి ప్రారంభించానని రాష్ట్ర మానవ వనరులశాఖ, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. గడిచిన ఎనిమిది మాసాల కాలంలో రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒప్పందాలు వివిధ సంస్థలతో జరిగాయన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్‌ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కంప్రెస్డ్‌ బయోగ్యా్‌స(సీబీజీ) ప్లాంట్‌కు బుధవారం మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘యువగళం పాదయాత్రలో భాగంగా జి.డి.నెల్లూరు నియోజకవర్గంలోని ఓ గ్రామం వద్ద రోడ్డుపక్కన బొండాలు అమ్ముతున్న మహిళ సమస్యలను విన్నాను. తాగుబోతు భర్త చనిపోతే బొండాలు వేసి అమ్ముతూ ఇద్దరు బిడ్డలను చదివిస్తోంది. తన బిడ్డల లాంటి వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరింది. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రధానాంశంగా పెట్టాలని చంద్రబాబును కోరాను. ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే ఉద్యోగాల కల్పన కోసం పని ప్రారంభించాను. పెట్టుబడుల కోసం అనేక ప్రాంతాలకు వెళ్లాను.

రిలయన్స్‌ చూపు రాష్ట్రం వైపు

ధీరూభాయ్‌ అంబానీ కాలం నుంచి సీఎం చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంతోనే రాష్ట్రం వైపు రిలయన్స్‌ సంస్థ చూస్తోంది. ఈక్రమంలోనే సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. వారి సూచన ప్రకారం రాష్ట్రంలో నూతన ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ (ఐస్‌) పాలసీ తీసుకువచ్చాం. రూ. 65 వేల కోట్ల పెట్టుబడులతో 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్‌ ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా 2.50 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రాంతంలో బీడు భూములను వారికి లీజుకు ఇస్తే ప్రభుత్వ భూములకు రూ. 15 వేలు, ప్రైవేటు భూములకు రూ. 30 వేలు కౌలు చెల్లించి సైపర్‌ గడ్డి పెంచుతారు. దాని ద్వారా గ్యాస్‌ ఉత్పత్తి చేస్తారు. రైతులు గడ్డి పెంచి ఇస్తే వారు కొనుగోలు చేస్తారు. రాష్ట్రంలో 500 ప్లాంట్ల కోసం 5 లక్షల ఎకరాలు అవసరం.


ప్రకాశం, కడప, అనంతలకు ప్రాధాన్యం

ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. తొలి ప్లాంట్‌ను అత్యంత వెనుకబడిన కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాం. తొలుత జిల్లాలో నాలుగు ప్లాంట్లు అనుకున్నాం. ఇక్కడి పరిస్థితులను బట్టి 50 వేల ఎకరాలు సమకూర్చుతామని స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి సభాముఖంగా చెప్పారు. అలా అయితే ఒక్క కనిగిరి ప్రాంతంలోనే 50 ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సీబీజీ ప్లాంట్‌ హబ్‌గా మార్చుతాం. దీని వల్ల ఉపాధి పెరిగి రైతులకు లాభం చేకూరి వలసలు నివారణ అవుతాయి. కొందరు ప్లాంట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో 2014-19 మధ్య ఎంతో కష్టపడి అనేక కంపెనీలను రాష్ట్రానికి తెస్తే ఆ తర్వాత వైసీపీ పాలకులు పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పారదోలారు. ఇప్పటికీ అభివృద్ధి పనులు, పారిశ్రామిక రంగంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి ప్రచారాలు మానుకోకపోతే వారిని రెడ్‌బుక్‌లోకి ఎక్కిస్తా.

మన బ్రాండ్‌ సీబీఎన్‌..

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన అంటే మాటలా.. ఎలా సాధ్యం, ఏమిటి నీ ధైర్యం అని అనేకమంది నన్ను అడిగారు. తెలంగాణకు హైదరాబాద్‌, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు ఉంటే మా ఆంధ్రకు చంద్రబాబు (సీబీఎన్‌) ఉన్నారు. అదే మా బ్రాండ్‌, అదే మా ధైర్యం అని వారందరికీ సమాధానమిచ్చా. ఆ బ్రాండ్‌ను చూసే అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు వస్తున్నాయి. వాటిలో రిలయన్స్‌, ఎన్‌టీసీఈ, టీసీఎస్‌, టాటా పవర్‌, మిట్టల్‌ స్టీల్‌ వంటి దిగ్గజ కంపెనీలున్నాయి. రాష్ట్రంలో రిలయన్స్‌ సంస్థ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు చేయడం అంటే సీబీఎన్‌ పీ4 విధానానికి నాంది వంటిది. వీటి ఏర్పాటు ద్వారా బీడు భూములను వినియోగంలోకి తీసుకురావడం, దాని వల్ల రైతులకు లీజు రూపంలో డబ్బు రావడం, స్థానికంగా యువతకు ఉద్యోగాలు రావడం ద్వారా పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి.


త్వరలోనే కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీ

ప్రకాశం జిల్లా పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉంది. యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన జిల్లాలో లభించింది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలు అధికంగా ఉండటంతో ఈ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నాం. త్వరలో కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. వెలిగొండను కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేర్చింది. దాని నిర్మాణం పూర్తిచేసి చివరి ఎకరాకు కూడా నీరు ఇస్తాం. తాగునీటి ఇక్కట్లను తీర్చుతాం. కేంద్ర భాగస్వామ్యంతో చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ పనులు సరిగా చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం నిధులు దోపిడీ చేస్తే అన్న పవన్‌ కల్యాణ్‌ కేంద్రంతో మాట్లాడి ఆ పథకం గడువును పొడిగించేలా చేశారు. ఆ పథకం ద్వారా ఇంటింటికి కుళాయితో నీరు ఇస్తాం’’ అని లోకేశ్‌ చెప్పారు.

50 వేల ఎకరాలు సమకూర్చుతా: ఎమ్మెల్యే ఉగ్ర

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉపాధి లేక కనిగిరి ప్రాంతవాసులు వలసలు వెళ్తున్నారని చెప్పారు. నీరు లేక, పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీజీ ప్లాంట్‌కు తమ నియోజకవర్గంలో రైతులను ఒప్పించి 50 వేల ఎకరాలు సమకూర్చే బాధ్యత తాను తీసుకుంటానని, వీలైనన్ని ఎక్కువ ప్లాంట్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, డాక్టర్‌ స్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, రిలయన్స్‌ డైరెక్టర్‌ పీఎ్‌సఎం ప్రసాద్‌, ఆ సంస్థ ప్రతినిధులు మాధవరావు, హెచ్‌కె త్రిపాఠిలతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలుత ప్లాంట్‌కు భూమిపూజ చేసి అనంతరం.. ఆ ప్లాంట్‌ ఎలా ఉంటుంది?, ఎలా పని చేస్తుంది?, గడ్డిపెంపకం, గ్యాస్‌ వినియోగం తదితర అంశాలపై డెమోను మంత్రి లోకేశ్‌ తిలకించారు.


భద్రతా వైఫల్యానికి సాక్ష్యాలివిగో..

గతేడాది తిరుమలలో ఏకంగా టీటీడీకి చెందిన బస్సును అపహరించి తీసుకువెళ్లారు. టోల్‌గేట్‌ మీదుగా దర్జాగా బస్సును నడుపుకుంటూ వెళ్లిపోయాడో దుండగుడు. నాయుడుపేట దగ్గరగానీ ఆ బస్సును గుర్తించి అడ్డుకోలేకపోయారు. టీటీడీకి చెందిన మరో వాహనం కూడా ఇదే తరహాలో చోరీకి గురైంది.

అటవీ శాఖకు చెందిన వ్యక్తులు వారం క్రితం టీటీడీ అనుమతి లేకుండా, టోల్‌గేట్‌లో భద్రతా సిబ్బందికి తెలియకుండా తిరుమలకు పడవలను తీసుకొచ్చారు. పాపవినాశనం రిజర్వాయర్‌లో బోటింగ్‌ ట్రయల్స్‌ కూడా నడిపారు.

పది రోజుల కిందట అర్చక నిలయం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ‘తిరుమలలోనే మద్యం అమ్ముతా... ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ సవాల్‌ విసిరాడు.

ఇటీవలే భద్రతా సిబ్బంది నివాసాలతో పాటు మీడియా కార్యాలయాలు ఉండే డీ-టైప్‌ క్వార్టర్స్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు దారిన వెళ్లేవారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో విజిలెన్స్‌ సిబ్బంది కూడా గాయపడ్డారు.

ఇటీవల సీఎం చంద్రబాబు తిరుమల వచ్చే ముందురోజు ఏటీసీ క్యూలైన్‌లోనే మద్యం సీసాలు కనిపించాయి. రాంబగీచా గెస్ట్‌హౌస్‌ వద్ద రోడ్డు పక్కనే కొందరు భక్తులు ఎగ్‌ బిర్యానీ తింటూ కనిపించారు.

అదనపు ఈవో కార్యాలయం వెనుక కొందరు మద్యం మత్తులో కారు ధ్వంసం చేయడంతో పాటు అద్దాలు పగలగొట్టి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు.

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ సారథ్యంలో సాధువులు తిరుమలలో ధర్నాకు దిగారు.

కల్యాణ వేదిక వద్ద ఫొటోగ్రాఫర్ల ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే సీఆర్వో వద్ద భక్తుల మధ్య గొడవ జరిగి ఇద్దరు గాయపడ్డారు.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 03:46 AM