Anil Ambani : అనకాపల్లి జిల్లాలో భూములు పరిశీలించిన అనిల్ అంబానీ
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:36 AM
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత అనిల్ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ పరిధిలోని సీతపాలెం, సెటమెట్ట గ్రామాల పరిసరాల్లోని భూములను పరిశీలించారు. సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు
సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం
అనకాపల్లి/రాంబిల్లి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత అనిల్ అంబానీ శనివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ పరిధిలోని సీతపాలెం, సెటమెట్ట గ్రామాల పరిసరాల్లోని భూములను పరిశీలించారు. సోలార్ ప్యానళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం అనిల్ అంబానీ ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఏపీఐఐసీ గతంలో సేకరించిన 1,500 ఎకరాలను అనిల్ అంబానీ విద్యుత్ సంస్థకు కేటాయించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ భూములను, సముద్ర తీర ప్రాంతాన్ని అనిల్ అంబానీ పరిశీలించారు. ఆయన వెంట ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, అనకాపల్లి ఆర్డీఓ ఆయుషా, ఏపీఐఐసీ జెడ్‌ఎం హరిప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 06:36 AM