Sri Rama Navami: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు

ABN, Publish Date - Apr 05 , 2025 | 11:36 AM

రేపు భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవ్వాలనుకున్నారు. అందుకు ఒక రోజు ముందుగానే బయల్దేరి రాత్రి అక్కడే బస చేయాలనకున్నారు. అయితే..

Sri Rama Navami: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
Pawan Kalyan

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల భద్రాచలం పర్యటన రద్దైంది. రేపు సీతారాముల కళ్యాణం సందర్భంగా ఇవాళ, రేపు పవన్ కళ్యాణ్ భద్రాచలంలో ఉండాలనుకున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ మాదాపూర్ లోని తన నివాసం నుంచి బయల్దేరి సాయంత్రం గం.5 కి పవన్ భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రి భద్రాచలంలో బస చేసి, రేపు స్వామివారి కళ్యాణం సందర్భంగా ఉత్సవానికి హాజరై ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాములకి సమర్పించాలన్నది షెడ్యూల్ లోని ప్లాన్.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమై, రేపు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోవాలని మొదట భావించారు. అయితే, ఈ పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందేమోనని భావించి పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. పర్యటన రద్దుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి వర్తమానం పంపించారు. కాగా, రేపు స్వామివారి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం వెళ్లనున్నారు.

కాగా, నేటి నుంచి ఏపీలోని ఒంటిమిట్టలో శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. రేపు శ్రీ రామనవమి సందర్భంగా ధ్వజారోహణ ఉంటుంది. ఈ నెల 11న ఒంటిమిట్ట కోదండ రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.


ఇవి కూడా చదవండి

Axis Power Deal: జగన్‌ బాటలోనే చంద్రబాబు

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 11:49 AM