ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati Stampede: వారిద్దరిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

ABN, Publish Date - Jan 09 , 2025 | 06:51 PM

Tirupati Stampede: తిరుమలలో తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో టీటీడీ ఈవో, జేఈవోపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Dy CM Pawan Kalyan

తిరుపతి, జనవరి 09: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావుతోపాటు జేఈవో వెంకయ్య చౌదరిపై మండిపడ్డారు. బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారన్నారు. ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని.. వారిద్దరికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

టీటీడీలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి.. క్షమాపణ చెప్పాలని టీటీడీ పాలకమండలిలోని సభ్యులకు పవన్‌ కల్యాణ్ సూచించారు. తిరుపతిలో తప్పు జరిగింది క్షమించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టాలని టీటీడీకి సూచించారు. రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.


అంతకు ముందు తిరుపతిలోని బైరాగి పట్టెడ పద్మావతి పార్కులో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. భక్తులను ఒకే సారి ఎందుకు వదిలారంటూ వారిని ప్రశ్నించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైవిధంగా స్పందించారు.

Also Read: నేను ఊరుకొన్న.. ఆయన వదిలి పెట్టడు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Also Read: తిరుపతి తొక్కిసలాటలో క్షతగాత్రులు కొరిందదే.. ఒప్పుకొన్న సీఎం చంద్రబాబు


ఇక ఇదే వ్యవహారంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ.. టీటీడీలోని పలువురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఎస్పీ, ఏఈవో, విజిలెన్స్ ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: హస్తిన పీఠం కోసం .. బీజేపీ స్కెచ్

Also Read: ప్రధాని మోదీ పర్యటన.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

Also Read: జీహెచ్ఎంసీ ఎదుట మెరుపు ధర్నా.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం

For AndhraPradesh News And Telugu news

Updated Date - Jan 09 , 2025 | 07:08 PM