ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం

ABN, Publish Date - Jan 10 , 2025 | 06:26 PM

AP News: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. జగనన్న కాలనీల పేరు మార్చుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

అమరావతి, జనవరి 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. అయితే ఆ కాలనీల పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ కాలనీలకు పీఎంఏవై - ఎన్టీఆర్ నగర్‌గా పేరు మారుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు పథకాలకు వైఎస్ జగన్ పేరు పెట్టుకొన్నారు. అలాగే పలు సంస్థలకు సైతం దశాబ్దాలుగా ఉన్న పేర్లను తొలగించి.. వాటికి సైతం వైఎస్ఆర్ పేరు పెట్టారు. దీనిపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఇక భూములు సర్వేతోపాటు పొలాల సర్వే చేసిన పాస్ పుస్తకాలపై సైతం సీఎం వైఎస్ జగన్ బొమ్మ ముద్రించుకొన్నారు.


అలాగే పొలంలోని సరిహద్దు రాళ్లపై కూడా సీఎం వైఎస్ జగన్ బొమ్మలు ముద్రించారు. అసలే రాష్ట్ర విభజనతో.. ఆదాయం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి అవనసరపు ఖర్చులు ఎందుకనే ఓప్రశ్న అయితే సర్వత్ర ఉత్పన్నమైంది. కానీ దుబారా ఖర్చు మాత్రం ఆగలేదు.

Also Read: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు

Also Read: బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది


అదే విధంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలకు వైసీపీ రంగులు వేశారు. అందుకోసం వేలాది కోట్ల రూపాయిల ప్రజా ధనం నీళ్లలా ఖర్చు చేశారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా.. అప్పు చేసి మరీ ఈ తరహా ఖర్చులకు కోట్లాది రూపాయిలు వినియోగించారు. అదీకాక.. జగన్ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

Also Read: గత ప్రభుత్వం.. ప్రభుత్వ డెయిరీలను చంపేసింది

Also Read: టీటీడీ చైర్మన్‌, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్


దాంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు. రహదారుల తీరు అస్తవ్యస్తంగా మారాయి. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇక రాష్ట్రంలోని పరిశ్రమలు సైతం ఏపీని వదిలి పోయాయి. అలాంటి వేళ.. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ప్రభుత్వం కొలువు తీరిన ఈ ఆరు నెలల్లో గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై పునరాలోచన చేసింది. అందులోభాగంగా జగనన్న కాలనీల పేరును పీఎంఏవై - ఎన్టీఆర్ నగర్‌గా మార్చింది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 06:26 PM