ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Jails: జైళ్ల శాఖలో 400 పోస్టుల భర్తీకి చర్యలు’

ABN, Publish Date - Jan 11 , 2025 | 03:26 AM

జైళ్ల శాఖలోని వివిధ విభాగాల్లో 400 పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఏపీ జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.

200 మంది ఖైదీల క్షమాభిక్షకు ప్రతిపాదనలు: ఏపీ జైళ్ల శాఖ ఐజీ

ఆరిలోవ (విశాఖపట్నం), జనవరి 10(ఆంధ్రజ్యోతి): జైళ్ల శాఖలోని వివిధ విభాగాల్లో 400 పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఏపీ జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జైళ్లలో నూతన భవనాల నిర్మాణం, ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.రాజమహేంద్రవరం కారాగారంలో భవనాల నిర్మాణానికి రూ.33.5 కోట్లు, ఆధునికీకరణ, పాలనాపరమైన అంశాలకు రూ.10.7 కోట్లు, విశాఖ సెంట్రల్‌ జైలులో అదనపు భవనాల నిర్మాణానికి రూ.15 కోట్లు, ఆధునికీకరణకు రూ.24 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖ జైలులో 73 మంది మహిళా ఖైదీలు ఉన్నారన్నారు. ఇక్కడ డీ ఎడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ కారాగారంలో 496 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్ల నుంచి 200 మంది ఖైదీల క్షమాభిక్షకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. కాగా, ఇటీవల విశాఖ జైలులో నాలుగు సెల్‌ఫోన్లు లభించిన ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విశాఖ జైలులో ఖైదీలు ఎక్కువగా ఉండడంతో 200 మంది రిమాండ్‌ ఖైదీలను రాజమహేంద్రవరం తరలించనున్నట్టు ఐజీ తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 03:26 AM