ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

APERC: ప్రజలపై విద్యుత్‌ భారం ఉండదు

ABN, Publish Date - Jan 11 , 2025 | 03:53 AM

వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారం ఉండబోదని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌ స్పష్టం చేశారు.

14,683 కోట్ల లోటును ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుంది

డిస్కంలు కూడా పెంపును ప్రతిపాదించలేదు

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ రామ్‌సింగ్‌ వెల్లడి

2025-26 టారిఫ్‌ ప్రతిపాదనలపై

కర్నూలులో ముగిసిన బహిరంగ విచారణ

3 రోజులు ప్రజాభిప్రాయ సేకరణఛ

కల్లూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారం ఉండబోదని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌ స్పష్టం చేశారు. డిస్కంలు కూడా పెంపు ప్రతిపాదనలు చేయలేదన్నారు. ఆదాయ లోటు రూ.14,683 కోట్లను ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుందని తెలిపారు. ఏపీఎ్‌సపీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఈపీడీసీఎల్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2025-26కి సంబంధించి సమర్పించిన ఆదాయ వనరులు, ప్రతిపాదిత టారి్‌ఫలపై 7,8 తేదీల్లో విజయవాడలో బహిరంగ విచారణ జరిపిన కమిషన్‌.. శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో చివరిరోజు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా చైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌ మాట్లాడుతూ.. 2025-26లో సుమారు రూ.14,683 కోట్లు లోటు ఉంటుందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుందని స్పష్టంచేశారు. మూడ్రోజుల ప్రజాభిప్రాయ సేకరణలో ఉదయం వ్యక్తిగతంగా అభ్యంతరాలు వినిపించేవారికి అవకాశం ఇచ్చామని.. ఆన్‌లైన్‌, వర్చువల్‌ విధానంలో పాల్గొన్నవారి నుంచి మధ్యాహ్నం అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. 3రోజుల విచారణలో మొత్తం 94మంది పాల్గొన్నారని, వారినుంచి స్వీకరించిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలపై డిస్కంలను వివరణ కోరామని.. వాటి వివరణపై ప్రజలు, నిపుణులు, ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆక్షేపణలను రికార్డు చేశామని.. వాటన్నింటినీ కమిషన్‌ పరిశీలించి.. 2025-26 రిటైల్‌ సప్లై టారిఫ్‌ ఆర్డర్‌ను ఖరారు చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో చైర్మన్‌తో పాటు కమిషన్‌ సభ్యుడు పి.వెంకటరామరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 03:53 AM