Asha : 25 తర్వాత సేవలన్నీ నిలిపివేత
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:03 AM
ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు కనీసం రూ.1000 కోట్ల విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎ్‌సతో మంగళవారం సమావేశమైన
బకాయిల్లో వెయ్యి కోట్లు విడుదల చేయాలని డిమాండ్
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు కనీసం రూ.1000 కోట్ల విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎ్‌సతో మంగళవారం సమావేశమైన తర్వాత ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులు.. బుధవారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల యజమానులు మాట్లాడుతూ రూ.500 కోట్లు విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది కూడా 15వ తేదీకి ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రూ.1000 కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమించాలని నిర్ణయించారు. 6వ తేదీ నుంచి ఈహెచ్‌ఎస్, ఓపీ సేవలను నిలిపివేసిన ఆస్పత్రులు, 25వ తేదీ నుంచి పూర్తిగా వైద్య సేవలు నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చారు.ఆరోగ్యశాఖ అధికారులు ఒకవైపు యాజమాన్యాలతో చర్చలు జరుపుతూనే, మరోవైపు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెందిన 11 బృందాలు 10 ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేశాయి. దీనిపై ఆశా ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jan 09 , 2025 | 05:03 AM