Balineni Srinivasa Reddy: అమ్మవారి సాక్షిగా వైసీపీ గురించి పచ్చి నిజాలు చెప్పిన మాజీ మంత్రి
ABN, Publish Date - Mar 15 , 2025 | 11:20 AM
Balineni Srinivasa Reddy Comments On YSRCP Balineni Srinivasa Reddy: అమ్మవారి సాక్షిగా వైసీపీ గురించి పచ్చి నిజాలు చెప్పిన మాజీ మంత్రి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగన్‌తో కలిసి పని చేసిన బడా నాయకులే ఆయన క్రూర బుద్ధి గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా మారితే ఎంత దారుణంగా హింసలకు గురి చేస్తారో వివరిస్తున్నారు. తాజాగా, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ అకృత్యాల గురించి మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జగన్ కారణంగా తాను, తన కుటుంబం పడ్డ కష్టాలను చెప్పుకొచ్చారు. ఆ కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా’ అంటూ భావోద్వేగ పూరిత స్పీచ్ ఇచ్చారు. జగన్ తన ఆస్తి కొట్టేశారంటూ కంటతడి పెట్టుకున్నారు.
జగన్ నా ఆస్తి లాక్కున్నాడు.. బాలినేని కంటతడి
‘ నాకు జరిగిన అన్యాయం ఒక్క రోజులో చెబితే సరిపోదు. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో సగానికిపైనే అమ్ముకున్నాను. లెక్కచేయలేదు. సవాల్ చేస్తున్నా .. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలపైన విచారణ వేయండి. నా మీద వేయండి.ఎవరు తప్పు చేశారో, రూ.కోట్లు సంపాదించారో తేలుతుంది. జగన్ నా ఆస్తులు కాజేశారు. ఆ ఉక్రోషం, బాధ నాకు, నా కుటుంబానికి మాత్రమే తెలుసు. నాకు వైఎస్సార్ అంటే ఇష్టం. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కోసం, నా పదవి నాలుగేళ్లు ఉండగానే పదవి వదిలేసి జగన్ వెంట నడిచాను. వైసీపీ వచ్చాక నాకు మంత్రి పదవి ఇచ్చి వెంటనే తీసేశారు. నేను బాధపడలేదు.నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడతా’ అని అన్నారు.
సన్నిహితుడ్ని కూడా వదలని జగన్..
ఒకానొక సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. తనకు కావాల్సిన పనులు పట్టుబట్టి మరీ చేయించుకునే వారు. వైసీపీ వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది. కానీ, అనుకోని కారణాల వల్ల తర్వాతి కాలంలో .. మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి పోయింది. ఈ నేపథ్యంలోనే కొంత అసహనానికి గురైన ఆయన .. రెబల్‌గా మారారు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ టైంలోనే జగన్ బాలినేని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితుడని కూడా చూడకుండా.. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు ఇబ్బందులు పెట్టడం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలోనే బాలినేని ఆస్తులను సైతం కొట్టేసినట్లు తెలుస్తోంది. చాలా రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే బాలినేని వైసీపీకి పూర్తిగా దూరం అయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరారు.
Updated Date - Mar 15 , 2025 | 11:20 AM