Summer Clothing: వేసవిలో హాయి హాయిగా..!
ABN, Publish Date - Apr 07 , 2025 | 03:35 AM
ఎండాకాలంలో చెమట మరియు వేడి సమస్యలు తగ్గించేందుకు గాలి తగిలే, చెమటను పీల్చుకునే బట్టలు ధరించడం మంచిది. లినెన్, కాటన్, రేయాన్, మెరినో వూల్ వంటి బట్టలు శరీరాన్ని చల్లగా ఉంచుతూ సౌకర్యాన్ని కలిగిస్తాయి.

వేసవిలో కాటన్ బట్టలు ధరిస్తే హాయిగా ఉంటుంది. వీటి మీద ఉండే రంధ్రాల వల్ల శరీరానికి గాలి ఆడుతుంది. పత్తి దారాల నుంచి తయారుచేస్తారు కాబట్టి ఇవి చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
షిఫాన్ బట్టలు చాలా తేలికగా మెత్తగా ఉంటాయి. స్టయిల్‌గా కూడా కనిపిస్తాయి. చీరలు, షర్టులు, కుర్తీలు ఇలా ఏవి ధరించినా ఎండాకాలంలో సౌకర్యవంతంగా అనిపిస్తుంది. వేడుకలు, పార్టీలకు వెళ్లేటప్పుడు వేసుకోవడానికి రకరకాల డిజైన్లలో షిఫాన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి.
లినెన్(నార) బట్టలు చాలా తేలికగా ఉంటాయి. వీటిని సహజసిద్దమైన పీచులతో రూపొందిస్తారు కాబట్టి త్వరగా చెమటను పీల్చుకుంటాయి. ఇవి కాటన్ బట్టలకంటే బలంగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నుతాయి కూడా. వేసవికి మంచి ఎంపిక.
షీర్ బట్టలు చాలా పలుచగా ఉంటాయి. వీటిని కూడా పత్తి దారాల తోనే తయారు చేస్తారు. ఇవి కాస్త బరువుగా అనిపించినప్పటికీ ఎండాకాలంలో ధరించడానికి అనువుగా ఉంటాయి. ‘ఆర్గంజా’ ఈ కోవలోకే వస్తుంది. టాప్స్, పాంట్స్, స్కర్టులు, కుర్తీలు, గౌన్లు ఇలా ఎన్నో రకాల షీర్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి.
లాన్ బట్టలు చాలా మెత్తగా ఉంటాయి. వీటిలో కొంత మేరకు కాటన్ కలిసి ఉంటుంది. లాన్ దుస్తులు ఫ్యాషన్‌గా కనిపిస్తాయి. వేసవికాలంలో జరిగే వేడుకలకు వీటిని ధరించవచ్చు.
చాంబ్రే బట్టలు కొద్దిగా మందంగా ఉంటాయి. వీటిలో కూడా కాటన్ కలిసి ఉంటుంది. అందుకే వీటిని ధరించినప్పుడు చల్లని అనుభూతి కలుగుతుంది. చాంబ్రే లెగ్గింగ్స్‌ని మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారు.
వేసవికాలంలో మహిళలు పార్టీలకు వెళ్లేటప్పుడు చందేరీ, కశ్మీరీ, మట్క, క్రేప్ సిల్క్ చీరలు కట్టుకుంటే బాగుంటుంది. ఉద్యోగినులు కార్యాలయాలకు వెళ్లేటప్పుడు ప్రింటెడ్ కాటన్ చీరలు, హ్యాండ్‌లూమ్ చీరలు, షార్ట్ మోడల్ కుర్తాలు, ప్రింటెడ్ బాటమ్స్, కాటన్ జీన్స్, కాటన్ షర్ట్స్ వేసుకుంటే హాయిగా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News
Updated Date - Apr 07 , 2025 | 03:35 AM