Petro Price Effect: పెట్రో ధరలు: డోంట్ వర్రీస్.. అంతలోనే గుడ్ న్యూస్ వచ్చింది
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:52 PM
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందన్న వార్త వచ్చినంతలోనే మరో వార్త జనాలకి స్వాంతన కలిగించబోతోంది. అదేంటంటే..

కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జనం పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్నారు. రేపటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానుండటంతో వాహనదారులు ఎంతోకొంత మనీ సేవ్ చేసుకుందామని పెట్రోల్ బంకులకు క్యూకడుతున్నారు. దీంతో నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన రద్దీ వాతావరణం కనిపిస్తోంది. అయితే, ఇంతలోనే ఒక ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. పెంచిన ధరలు వినియోగదారులపై ప్రభావం చూపబోవని ఆ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్ర ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో సాధారణ ప్రజానీకానికి ఈ వార్త రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇలా ఉండగా, చాలా రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలను కేంద్రం ఇవాళ పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.10.7.66, డీజిల్ ధర రూ.95.82గా ఉంది. ఎక్సైజ్ డ్యూటీ పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82కు చేరాల్సి ఉంది. అయితే, కేంద్రం తాజా ప్రకటనతో ఆయా ధరల్లో మార్పులు ఉండవు. ఇక ప్రస్తుతం విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.76, డీజిల్ ధర రూ.97.51గా ఉంది. అవే ధరలు ఇకమీదట కూడా అమల్లో ఉంటాయి. సో డోంట్ వర్రీ.
మరోవైపు స్టాక్ మార్కెట్లో అమెరికా -చైనా ట్రేడ్ వార్, ఆర్థిక మాంద్యం భయాలు, ఒపెక్ ప్లస్ ఉత్పత్తి పెంపు వంటి అంతర్జాతీయ ఆర్థిక భయాల నేపథ్యంలో కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వారం వ్యవధిలోనే సుమారు 10 డాలర్ల వరకు తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది మూడేళ్ల కనిష్ట స్థాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో ఇప్పటికైనా పెట్రోల్ ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం పెట్రో పంపు అంటూ షాకివ్వడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి:
Vastu Tips: ఇంట్లో అద్దం పగిలిపోవడం శుభమా.. లేదా అశుభమా..
Hajj 2025: భారత్ సహా 13 దేశాల వీసాలు తాత్కాలికంగా నిషేధం..కారణమిదే..