Daggupati Purandeswari: బీజేపీ ఆశయాలకు పునరంకితం కావాలి
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:10 AM
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలకు కేడర్ పునరంకితం కావాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పురందేశ్వరి పిలుపు
దేశానికి సేవకుల్ని అందించిన పార్టీ: సుజనా చౌదరి
అమరావతి, రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆశయాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఆమె బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాత మనం అనేది పార్టీ సిద్ధాంతమని, దీన్ని కేడర్ పాటించాలని కోరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతానికి బీజేపీ నాయకత్వం కృషి చేస్తోందన్నారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం జనసంఘ్ నుంచి ప్రారంభమై అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడి ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తల్ని సంపాదించుకున్న ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్