ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బేఖాతరు!

ABN, Publish Date - Jan 14 , 2025 | 01:31 AM

బుడమేరు వరదల తర్వాత కూడా అధికారుల తీరు మారడం లేదు. కాల్వ కట్టలను ఆక్రమించి జరుగుతున్న నిర్మాణాలను వారు అడ్డుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త జోక్యం చేసుకుని కాల్వకట్టలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చేయాల్సిందిగా గత ఏడాది డిసెంబరు 17వ తేదీన వీఎంసీ కమిషనర్‌, కలెక్టర్‌, జలవనరులశాఖ చీఫ్‌ ఇంజనీరుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అధికారులు ఇంత వరకు అమలు చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

-అక్రమ కట్టడాలపై అమలుకునోచుకోని లోకాయుక్త ఆదేశాలు

-కాల్వగట్టు ఆక్రమించి కన్యకాపరమేశ్వరి ఆలయం, కల్యాణ మండపం నిర్మాణం

-నీటిపారుదల శాఖ స్థలంలో కట్టడాలు తొలగించాలన్న లోకాయుక్త

-వీఎంసీ కమిషనర్‌, కలెక్టర్‌, జలవనరులశాఖ చీఫ్‌ ఇంజనీరుకు ఆదేశాలు

బుడమేరు వరదల తర్వాత కూడా అధికారుల తీరు మారడం లేదు. కాల్వ కట్టలను ఆక్రమించి జరుగుతున్న నిర్మాణాలను వారు అడ్డుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త జోక్యం చేసుకుని కాల్వకట్టలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చేయాల్సిందిగా గత ఏడాది డిసెంబరు 17వ తేదీన వీఎంసీ కమిషనర్‌, కలెక్టర్‌, జలవనరులశాఖ చీఫ్‌ ఇంజనీరుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అధికారులు ఇంత వరకు అమలు చేయలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(విజయవాడ/వన్‌టౌన్‌ - ఆంధ్రజ్యోతి):

విజయవాడ సత్యనారాయణపురం వాటర్‌ ట్యాంక్‌ పక్కన, ఏలూరు కాల్వ ఒడ్డున ఇరిగేషన్‌ స్థలంలో స్థానికులు కన్యకాపరమేశ్వరి ఆలయం, కల్యాణ మండపం నిర్మాణం చేపట్టారు. దీనిపై 2023 మే 31న, జూన్‌ 1న ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అదే సమయంలో కేదారేశ్వరపేటకు చెందిన ఎం.వి.సుబ్బారావు ఈ అక్రమ నిర్మాణాలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపిన లోకాయుక్త ఆ నిర్మాణాలను నిలిపివేయాలని, పూర్తి చేసి ఉంటే తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కన్యకాపరమేశ్వరి ఆలయం, కల్యాణ మండపం ఎటువంటి అనుమతులు లేకుండా జలవనరుల శాఖ స్థలంలో నిర్మించడాన్ని తప్పుపట్టింది. సుమారు రూ.5 కోట్లు విలువైన 1000 చదరపు గజాల స్థలంలో కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారని ఇది సరైన విధానం కాదని లోకాయుక్త వ్యాఖ్యానించింది. గత ఏడాది డిసెంబరు 17వ తేదీన దీనిపై ఆదేశాలు జారీ చేసింది.

మాది కాదంటే మాది కాదంటూ..

లోకాయుక్త ఆదేశాలపై అటు జలవనరుల శాఖ ఇటు మున్సిపల్‌, రెవెన్యూ శాఖలు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టేసుకుంటున్నారు. జలవనరుల శాఖ అధికారులు ఆక్రమణలను తొలగించే అధికారం తమకు లేదని చెబుతున్నారు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమం మున్సిపల్‌, రెవెన్యూ శాఖలు చూసుకుంటాయని పేర్కొంటున్నారు. ఏలూరు కాల్వ ఒడ్డు సగభాగాన్ని ఆక్రమించుకుని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేసినా తమకు సంబంధం లేదని జలవనరుల శాఖ చేతులు దులుపుకోవడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇదే విషయాన్ని 2023 డిసెంబరు 22న జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ చీఫ్‌ తన నివేదికలో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. జలవనరుల శాఖకు ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ఎటువంటి అధికారాలు లేవని ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపు బాధ్యత మున్సిపల్‌ అధికారులదేనని తెలిపారు. మరోవైపు మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు సైతం ఆక్రమణలు నీటిపారుదల శాఖ స్థలంలో జరిగాయని, వారు కోరితే తప్ప తాము వాటిని తొలగించలేమని చేతులు దులిపేసుకుంటున్నారు. ఆక్రమణదారులను రక్షించేందుకు ఈ శాఖలు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టేసుకుంటున్నారు. వాస్తవానికి జలవనరుల శాఖ తమ స్థలం ఆక్రమణకు గురైనప్పుడు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల సహకారంతో ఆక్రమణలను తొలగించే అవకాశం ఉంది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఎవరికి వారు తమకు పట్టనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.

Updated Date - Jan 14 , 2025 | 01:31 AM