Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో కేంద్ర బృందం
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:24 AM
పోలవరం ప్రాజెక్టులో వినియోగించబోయే మట్టిని పరిశీలించేందుకు కేంద్ర నిపుణుల బృందం మూడు రోజుల పాటు పరిశీలన చేస్తుంది. వారు దండంగి గ్రామం, స్పిల్‌వే ప్రాంతాల్లో మట్టి శాంపిళ్లు సేకరిస్తారు.

పోలవరం, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న గ్యాప్-1, గ్యాప్-2, డయాఫ్రంవాల్ ప్రాంతాల్లో వినియోగించనున్న మట్టి నాణ్యతా ప్రమాణాలను కేంద్ర నిపుణుల బృందం మూడ్రోజుల పాటు పరిశీలించనుంది. ఏలూరు జిల్లా పోలవరంలో ప్రాజెక్టు ఈఈ బాలకృష్ణ సోమవారం మాట్లాడుతూ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం పోలవరం చేరుకుంటుందని తెలిపారు. ఈ బృందంలో కేంద్ర మెటీరియల్ అండ్ సాయిల్ రిసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్ధార్థ్ హెడావో, సైంటిస్టు, ఏఆర్వో విపుల్ కుమార్ గుప్తాలు ఉన్నట్లు పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించేందుకు అల్లూరి జిల్లా దండంగి గ్రామం వద్ద, స్పిల్‌వే సమీపంలో ఉంచిన మట్టి నిల్వల వద్ద ఈ బృందం శాంపిల్స్ సేకరించనున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..