యాదవులకు కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన ఇవ్వాలి

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:46 PM

యాదవులకు కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన కేటాయించాలని యాదవ సామాజిక వర్గం నాయకులు డిమాండ్‌ చేశారు.

యాదవులకు కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన ఇవ్వాలి
మాట్లాడుతున్న యాదవ నాయకులు

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): యాదవులకు కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన కేటాయించాలని యాదవ సామాజిక వర్గం నాయకులు డిమాండ్‌ చేశారు. యాదవులకు కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన పదవి ఇవ్వాలని కోరుతూ ఆదివారం జిల్లా పరిషత సమావేశ భవనంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌ అధ్వర్యంలో యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం యాదవులు మాట్లాడుతూ అధికంగా ఓటు బ్యాంకు ఉన్న యాదవులకు న్యాయం చేయాలని కోరారు. మాజీ కార్పొరేటర్‌ శేషుయాదవ్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక్క సీట్‌ అయిన యాదవులకు కేటాయించకపోవగడం శోచనీయమన్నారు. ఇలాంటి తరుణంలో నగరానికి చెందిన నాగరాజు యాదవ్‌కు కేడీసీసీ బ్యాంకు చైర్మన పదవి ఇవ్వాలని టీడీపీని కోరడం ఎంతో ఆనందదాయక విషయమన్నారు. అనంతరం యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వరుణ్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ జిల్లాలో యాదవులకు ఒక్క నామినేటేడ్‌ పోస్టు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ యువజన విబాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబిఎన.రాజు మాట్లాడుతూ జిల్లాలో బీసీ కులాల్లో ఎక్కు వజనాభా ఉన్న యాదవులే టీడీపీ పార్టీ వెంట ఉన్నారన్నారు. సమావేశంలో విజయ స్టీల్స్‌ అధినేత రాముయాదవ్‌, సింధునాగేశ్వరరావు యాదవ్‌, జీఏ.క్రిష్ణమూర్తి, రమణ, అయ్యన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:46 PM