Andhra Pradesh governance: మరింతగా సుపరిపాలన
ABN, Publish Date - Apr 08 , 2025 | 05:10 AM
రాష్ట్రంలో సుపరిపాలన బలోపేతానికి నిపుణులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆన్‌లైన్, డిజిటల్, మనమిత్ర-వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నారు.

పది మంది నిష్ణాతులతో సలహామండలి
జూన్ 12కల్లా వాట్సా్‌పలోనే అన్ని డిజిటల్ సేవలు: సీఎం
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో సభ్యులుగా బిల్‌గేట్స్ ఫౌండేషన్, మద్రాస్ ఐఐటీ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులు ఉంటారని వెల్లడించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా చేపట్టాల్సిన అంశాలపై సలహా మండలి అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సేవలు కావాలన్నా ఆన్‌లైన్, డిజిటల్, మనమిత్ర-వాట్సాప్ గవర్నెన్స్‌ను వినియోగించుకుని సేవలు పొందవచ్చని చెప్పారు. జూన్ 12కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవలన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. దీనికి అనుగుణంగా ఆర్టీజీఎ్‌సలో డేటాను అనుసంధానం చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం 254 ప్రభుత్వ సేవలను మనమిత్ర-వాట్సాప్ గవర్నెన్స్‌లో అందిస్తున్నామని, వాటిని 1000కి పైగా పెంచాలని ఆదేశించారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టంచేశారు. ఆర్థిక వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. సచివాలయంలో సోమవారం తనను కలిసిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ గోపాల్, ఆ శాఖల ఉన్నతాధికారులను అభినందించారు. వారికి అరకు కాఫీ గిఫ్ట్‌ప్యాక్‌లు అందించారు.
2047 నాటికి రూ. 347 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ
వృద్ధిరేటు రెండింతలు పెరిగితే రాష్ట్ర ఆదాయం నాలుగున్నర రెట్లు పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో అస్తవ్యస్త పాలన, తుగ్లక్ నిర్ణయాల వల్ల జీఎ్‌సడీపీ రూ.7 లక్షల కోట్లు వెనుకబడిందన్నారు. ఆమేర పెరిగితే అదనంగా రూ. 76,195 కోట్లు వచ్చేవని, అప్పులు తగ్గేవని చెప్పారు. 2047నాటికి జీఎస్‌డీపీని రూ. 347 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం రూ. 58,14,916కు పెంచడమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..
Updated Date - Apr 08 , 2025 | 05:10 AM