Poverty Eradication Vision: చంద్రబాబు విజన్‌తో పేదరిక నిర్మూలన
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:56 AM
చంద్రబాబు విజన్‌తో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. పీ-4 కార్యక్రమం ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు

అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు తన విజన్‌తో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. సామాజిక న్యాయం, సాధికారితపై కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ అధ్యక్షతన ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరిగిన జాతీయ స్థాయి చర్చా కార్యక్రమం ‘చింతన్ శివిర్’లో ఆయన పాల్గొన్నారు. మంగళవారం రెండో రోజు సమావేశానికి హాజరైన మంత్రి డోలా ఏపీలో అమలు చేస్తున్న పీ-4 కార్యక్రమంపై ప్రజెంటేషన్ ఇచ్చా రు. దీన్ని ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తిగా తిలకించారు.అనంతరం డోలా మాట్లాడుతూ విజన్-2047లో భాగంగా పేదలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు ఉగాది రోజున పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. సమాజంలోని ధనవంతులు నిరుపేద ల అభివృద్ధికి సహకరించడమే దీని ఉద్దేశమన్నారు. తమ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చి, ఈగల్ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో డీఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీయేనన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అనుసంధానంతో పారిశుధ్య నిర్వహణను నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు.