Supreme Court Chief Justice: తిరుమలేశుడి సేవలో సీజేఐ జస్టిస్‌ ఖన్నా

ABN, Publish Date - Apr 07 , 2025 | 04:24 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదివారం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు మరియు శ్రీవారి శేష వస్త్రాన్ని ఆయనకు అందజేశారు.

Supreme Court Chief Justice: తిరుమలేశుడి సేవలో సీజేఐ జస్టిస్‌ ఖన్నా

తిరుమల, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలిసారిగా శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం సంప్రదాయ వస్త్రఽధారణతో కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం-1 కాంప్లెక్స్‌ క్యూలైన్‌ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, అర్చక బృందం మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన జస్టిస్‌ ధ్వజస్తంభాన్ని తాకి అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీజేఐకి అర్చకులు శ్రీవారి శేష వస్ర్తాన్ని మెడలో ధరింపజేశారు.


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 04:24 AM