23 మద్యం షాపులకు 185 దరఖాస్తులు
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:52 AM
జిల్లాలో గీత కార్మికుల మద్యం దుకాణాలకు అనూహ్య స్పందన లభించింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసినా అనుకున్న స్పందన రాక పోవడంతో ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించింది. దీంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి గీత కార్మికులు ఎక్కడెక్కడ వున్నారు? వారి పరిస్థితి ఏమిటి? దరఖాస్తులు రాకపోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీశారు. దీంతో ప్రతి దుకాణానికి రూ.2 లక్షలు చెల్లించి తిరిగి రాని డిపాజిట్‌గా ఉండటంతో ఆర్థిక స్థోమత అంతగా లేని వారు ఆసక్తి కనపరచలేదు. గడువు పెంచి అధికారులు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రస్తుతం జిల్లాలోని 23 గీత కార్మికుల మద్యం దుకాణాలకు దాదాపు 185 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తిరుపతి రూరల్ మండలంలోని ఈడిగ సామాజిక వర్గాం నుంచి అత్యధికంగా 30 దరఖాస్తులు వచ్చాయి.

- జిల్లాలో గీత కార్మికుల దుకాణాలకు అనూహ్య స్పందన
- నేడు ఎంపిక, కేటాయింపులు
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గీత కార్మికుల మద్యం దుకాణాలకు అనూహ్య స్పందన లభించింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసినా అనుకున్న స్పందన రాక పోవడంతో ప్రభుత్వం మళ్లీ దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించింది. దీంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేసి గీత కార్మికులు ఎక్కడెక్కడ వున్నారు? వారి పరిస్థితి ఏమిటి? దరఖాస్తులు రాకపోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీశారు. దీంతో ప్రతి దుకాణానికి రూ.2 లక్షలు చెల్లించి తిరిగి రాని డిపాజిట్‌గా ఉండటంతో ఆర్థిక స్థోమత అంతగా లేని వారు ఆసక్తి కనపరచలేదు. గడువు పెంచి అధికారులు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రస్తుతం జిల్లాలోని 23 గీత కార్మికుల మద్యం దుకాణాలకు దాదాపు 185 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తిరుపతి రూరల్ మండలంలోని ఈడిగ సామాజిక వర్గాం నుంచి అత్యధికంగా 30 దరఖాస్తులు వచ్చాయి. ఇక తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఈడిగ సామాజిక వర్గం నుంచి 25, తడ నుంచి 17, ఓజిలి నుంచి 11, వరదయ్యపాలెం మండలం నుంచి 8, శ్రీకాళహస్తి నుంచి 4, వెంకటగిరి నుంచి 5, గూడూరు నుంచి 6, తొట్టంబేడు నుంచి 4, కేవీబీ పురం నుంచి 9, ఎర్రావారిపాలెం 5, డక్కిలి 1, నారాయణవనం నుంచి 5, శ్రీకాళహస్తి రూరల్ నుంచి 3, బాలయ్యపల్లి 4 దరఖాస్తులు వచ్చాయి. ఇక గౌడ సామాజిక వర్గానికి సంబంధించి పుత్తూరు మున్సిపాలిటీ నుంచి 13, నాయుడుపేట మున్సిపాలిటీ 9, గౌండ్ల సామాజికవర్గానికిగాను సూళ్ళూరుపేట నుంచి ఒకటి, పెళ్ళకూరు 3, వాకాడు 2 వచ్చాయి. గౌడ్ సామాజికవర్గంలో చిట్టముత్తూరు నుంచి 11, నాగలాపురం 5, దొరవారిసత్రం 4 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించి అర్హత కలిగి, ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలు కేటాయిస్తారని జిల్లా ఈఎస్ నాగమల్లేశ్వర రెడ్డి చెప్పారు.
Updated Date - Feb 10 , 2025 | 12:52 AM