ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

21మందికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

ABN, Publish Date - Jan 01 , 2025 | 01:41 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెవిన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులకు సీనియర్‌ అసిస్టెంట్లుగా, ఎంఆర్‌ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెవిన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులకు సీనియర్‌ అసిస్టెంట్లుగా, ఎంఆర్‌ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో పనిచేస్తున్న 80 మంది జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్టుల్లో మూడుసంవత్సరాలు ప్రొబేషన్‌ పూర్తిచేసుకున్నవారిని,సర్వే ట్రైనింగ్‌, అకౌంటెంట్‌ పరీక్షలు ఉత్తీర్ణులైనవారిని కలెక్టరేట్‌ వర్గాలు గుర్తించాయి. ఇతర కారణాలతో వీరిలో టి. సాంబశివాచారి (తిరుపతి), టి. సుజాత (తొట్టంబేడు)లకు మినహాయింపు ఇచ్చారు. పదోన్నతి పొందిన జాబితాను ఇదివరకే ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఎట్టకేలకు సీనియారిటీ పొందిన 21మందిని అర్హులుగా గుర్తించి తుది జాబితా తయారుచేశారు. వీరికి అడహాక్‌ పద్ధతిలో పదోన్నతి ఇస్తున్నట్లు కలెక్టర్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏ కారణం చేతైనా భవిష్యత్‌లో ఇచ్చిన పదోన్నతిని రద్దుచేసే అవకాశం ఉంటుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎవరూ కూడా సీనియారిటీ అంటూ ఏ విధమైన క్లెయిమ్స్‌ చేసేందుకు అర్హులు కాదన్నారు.పదోన్నతి పొందిన 21 మందికి ప్లేస్మెంట్‌ పోస్టింగ్‌ ఆర్డర్లు త్వరలో జారీచేయనున్నారు.

Updated Date - Jan 01 , 2025 | 01:41 AM