Share News

భూమనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:30 AM

ఎస్పీకి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి పిర్యాదు

భూమనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి
జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజుకు ఫిర్యాదు చేస్తున్న భానుప్రకాష్‌రెడ్డి,సామంచి తదితరులు

తిరుపతి(నేరవిభాగం) ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): హిందువులు మనోభావాలు దెబ్బతీస్తూ గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పలువురు బీజీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, పార్టీ నాయకులు అజయ్‌కుమార్‌, డాక్టర్‌ శ్రీహరి, ఆముదాల ఓంప్రకా్‌షలు ఈమేరకు జిల్లా ఎస్పీ హర్షవర్ధనరాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం భానుప్రకాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, గోశాలను గో వధశాలగా మార్చారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న కరుణాకర రెడ్డిపై ఐటి యాక్టు 74, బీఎన్‌ఎ్‌స యాక్టు 365 కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఆయన ఛైర్మన్‌గా ఉన్న సమయంలో 45 లేగదూడలు, 34 గోవులు చనిపోయిన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు. అనారోగ్యం, వయసురీత్యా చనిపోతున్నా దుష్పృచారాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైసీపీ హయాంలో గోవులకు పురుగులు పట్టిన ఆహారం, కాలం చెల్లిన మందులు వాడారని ఆరోపించారు. టీటీడీ పరిధిలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నిటిపై చర్యలు తీసుకుంటామన్నారు. బిహార్‌ కంటే వైసీపీ హయాంలో జరిగిన దాణా స్కాం పెద్దదన్నారు. భవిష్యత్తులో టీటీడీపై ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకునేలా త్వరలో బోర్డులో నిర్ణయం తీసుకుంటామని భానుప్రకాష్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 01:30 AM