పక్షుల పండుగపై సందిగ్ధత
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:51 AM
పులికాట్ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కావా ల్సిన ఫ్లెమింగ్ ఫెస్టివల్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గత వైసీపీ హయాంలో ఆపేసిన పక్షుల పండుగను అట్టహాసంగా నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
మరో ఐదు రోజుల్లో వేడుక
ఇప్పటికీ మొదలుకాని పనులు
తడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పులికాట్ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కావా ల్సిన ఫ్లెమింగ్ ఫెస్టివల్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. గత వైసీపీ హయాంలో ఆపేసిన పక్షుల పండుగను అట్టహాసంగా నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కృషి చేశారు. మొదట జన వరి 10, 11, 12తేదీల్లో ఫ్లెమింగ్ ఫెస్టివల్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో 17, 18, 19 తేదీలకు మార్చారు.అదే సమయంలో నాయుడు పేటలో ఏటి పండుగ నిర్వహిస్తుండటంతో 18, 19, 20 తేదీల్లో పక్షుల పండుగ నిర్వహించాలని భావించారు.సూళ్లూరుపేటలో గత మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ కమిటీని ప్రకటించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఫ్లెమింగ్ ఫెస్టివ ల్ నిర్వహణకు మరో వారం రోజులు మాత్రమే ఉండగా ఇప్పటివరకు ఎటువంటి పనులు ప్రారంభంకాలేదు. పండుగ కమిటీ కూడా ఏర్పాట్లకు చొరవచూపడం లేదు. ఈ నేపథ్యంలో పక్షుల పండుగ జరుగుతుందా అన్న అనుమా నం జనాల్లో నెలకొంది.
Updated Date - Jan 12 , 2025 | 01:51 AM