ఇక కుప్పంలో భూగర్భ డ్రైనేజి
ABN, Publish Date - Feb 10 , 2025 | 01:22 AM
వైసీపీ హయాంలో నిస్తేజంగా మారిన ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అభివృద్ధి పనుల్ని చేపడుతోంది. కుప్పం నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజి ఏర్పాటు, అక్కడే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పునరుద్ధరించడం, రూ.10 కోట్ల వేర్వేరు నిధులతో తాగునీటి సమస్యను పరిష్కరించే పనుల్ని చేస్తోంది. ఆ శాఖలో జరిగే పురోగతిని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

- ఎన్టీఆర్ సుజల స్రవంతీ పునరుద్ధరణ
- రూ.10 కోట్లతో తాగునీటి ఎద్దడి పరిష్కారం
- ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్
వైసీపీ హయాంలో నిస్తేజంగా మారిన ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు అభివృద్ధి పనుల్ని చేపడుతోంది. కుప్పం నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజి ఏర్పాటు, అక్కడే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని పునరుద్ధరించడం, రూ.10 కోట్ల వేర్వేరు నిధులతో తాగునీటి సమస్యను పరిష్కరించే పనుల్ని చేస్తోంది. ఆ శాఖలో జరిగే పురోగతిని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
కుప్పంలో భూగర్భ డ్రైనేజి సక్సెస్ అవుతుందా?
కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీ మినహా నాలుగు మండలాల్లోనూ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రామకుప్పం మండల కేంద్రంలో 2018లో ఏర్పాటు చేసిన భూగర్భ డ్రైనేజి విజయవంతంగా నడుస్తోంది. ఇది కూడా సక్సెస్ అవుతుంది.
పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
రూ.110.21 కోట్లతో 451 పనుల్ని చేపడుతున్నాం. జనవరి 7వ తేదీన కుప్పంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో పనులు ప్రారంభమవుతాయి. మండలానికో ప్రాజెక్టు చొప్పున నాలుగు ప్రాజెక్టులుగా పనులు చేపడతాం.
జిల్లాలో తాగునీటి ఎద్దడికి చేపడుతున్న చర్యలు?
రూ.3.73 కోట్ల ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్)తో 118 గ్రామాలకు తాగునీటి సరఫరా పనులు చేస్తున్నాం. రూ.2.09 లక్షల జడ్పీ గ్రాంటుతో గ్రామాల్లో 62 చిన్నపాటి మరమ్మతు పనులు చేస్తున్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో రూ.4.17 కోట్లతో 110 ఓవర్‌హెడ్ ట్యాంకుల్ని పునరుద్ధరణ చేపట్టాం.
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పునరుద్ధరిస్తారా?
గతంలో టీడీపీ ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కుప్పంలో ఇప్పుడు 9 మదర్ ప్లాంట్లు, 50 ప్లాంట్లు పనిచేస్తున్నాయి. రూ.10.27 కోట్లతో మొత్తం 16 మదర్ ప్లాంట్లు, 202 ప్లాంట్లను మళ్లీ పునరుద్ధరించనున్నారు.
- చిత్తూరు సిటీ, ఆంధ్రజ్యోతి
Updated Date - Feb 10 , 2025 | 01:22 AM