సీఎం పర్యటనకు చకచకా ఏర్పాట్లు!
ABN, Publish Date - Jan 04 , 2025 | 01:48 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన 6, 7 తేదీల్లో ఖరారైంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగమంతా శుక్రవారం కుప్పంలో వాలిపోయింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ , కడా పీడీ వికాస్ మర్మత్, జేసీ విద్యాధరి తదితరులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్, ఆడిటోరియం, అగరం కొత్తపల్లె, ఎన్టీఆర్ స్టేడియం తదితర ప్రాంతాలలో పర్యటించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కుప్పం మండల సచివాలయంలో అధికారులతో కలెక్టర్,ఎస్పీ , కడా పీడీ, జేసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.హెలిప్యాడ్ వద్ద బారికేడ్ల ఏర్పాటుతో పాటు కార్యక్రమాలు ఉండే ప్రాంతాలకు రూట్ మ్యాప్‌లను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కమిషనర్ శ్రీనివాసరావును ఆదేశించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.
6,7 తేదీల్లో కార్యక్రమాలపై
అధికారులకు దిశానిర్దేశం
కుప్పం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన 6, 7 తేదీల్లో ఖరారైంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగమంతా శుక్రవారం కుప్పంలో వాలిపోయింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ , కడా పీడీ వికాస్ మర్మత్, జేసీ విద్యాధరి తదితరులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ద్రావిడ విశ్వవిద్యాలయం హెలిప్యాడ్, ఆడిటోరియం, అగరం కొత్తపల్లె, ఎన్టీఆర్ స్టేడియం తదితర ప్రాంతాలలో పర్యటించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కుప్పం మండల సచివాలయంలో అధికారులతో కలెక్టర్,ఎస్పీ , కడా పీడీ, జేసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.హెలిప్యాడ్ వద్ద బారికేడ్ల ఏర్పాటుతో పాటు కార్యక్రమాలు ఉండే ప్రాంతాలకు రూట్ మ్యాప్‌లను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కమిషనర్ శ్రీనివాసరావును ఆదేశించారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. జిల్లాతో పాటు అన్ని శాఖల ప్రగతికి సంబంఽధించిన సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని సీపీవోను ఆదేశించారు.ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి పటిష్ఠమైన బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు.డీఆర్వో కె.మోహన్ కుమార్, పీఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈలు చంద్రశేఖర రెడ్డి, విజయకుమార్, జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డ్వామా, డీఆర్డీయే పీడీలు రవికుమార్, శ్రీదేవి, ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇస్మాయిల్, వ్యవసాయ, హార్టికల్చర్, పశు సంవర్థక, సెరికల్చర్ శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదనరెడ్డి, డాక్టర్ ప్రభాకర్, శోభారాణి, డీఎల్డీవో రవికుమార్,ఆర్డీవోలు పాల్గొన్నారు.
చంద్రబాబు పర్యటన ఇలా...
ముఖ్యమంత్రి ఈనెల 6వ తేదీన ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ద్వారా కుప్పం చేరుకుంటారు. యూనివర్శిటీ ఆడిటోరియంలో విజన్ డాక్యుమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.అనంతరం అగరం కొత్తపల్లెలో మహిళలతో ముఖాముఖి సమావేశమవుతారు.తర్వాత కుప్పం మున్సిపాలిటీ శీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముఖాముఖి జరుపుతారు.అక్కడినుంచి బయల్దేరి కుప్పం మండలం నడిమూరు గ్రామం చేరుకుని సౌర విద్యుత్తు పథకాన్ని ప్రారంభిస్తారు.అనంతరం ద్రావిడ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. అదేరోజు రాత్రి కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 7వ తేదీ ఉదయం కుప్పంలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారు. అనంతరం కంగుంది చేరుకుని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్.మునిరత్నం తండ్రి దివంగత పీఆర్.శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి కుప్పంలోని ఎన్టీఆర్ క్రీడా మైదానం చేరుకుని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక్కడినుంచి ద్రావిడ విశ్వవిద్యాలయం చేరుకుని జిల్లా అధికారులతో అభివృద్ధిపై సమీక్ష జరుపుతారు. అనంతరం కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు. 8వ తేదీ ఉదయం ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంనుంచి అమరావతి బయలుదేరి వెళ్తారు.
Updated Date - Jan 04 , 2025 | 01:48 AM