ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati Incident: తిరుపతి ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతి.. ఆవేదన..

ABN, Publish Date - Jan 09 , 2025 | 08:54 AM

అమరావతి: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై మంత్రి సవిత మాట్లాడుతూ..

Tirupati Incident

అమరావతి: తిరుపతి (Tirupati)లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి భక్తులు (Devotees) మరణించిన ఘటన తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై మంత్రి సవిత మాట్లాడుతూ.. వెంకన్న భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి సవిత అన్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. వైకుఠ ద్వారదర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి.. సజ్జల భార్గవరెడ్డి చెప్పినట్లు చేశా!


జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి అవకాశం ఉంటుందని, భక్తుల పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా టీటీడీ అధికారులు భావించాలని అన్నారు. తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని, గాయపడిన ప్రతీ క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. తిరుపతిలో జన సైనికులు, వీర మహిళలు తోడ్పాటు అందించాలని నాగబాబు పిలుపిచ్చారు. తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల వద్ద, క్యూ లైన్ల దగ్గర అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తోడ్పాటు అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నానన్నారు. జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నారని, దర్శనం టికెట్ కోసం తిరుపతి నగరంలో 9 కౌంటర్లు ఏర్పాటు చేశారని, 7 లక్షల మందికిపైగా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారని, ప్రతీ భక్తుడు సంయమనం పాటించాలని కోరుతున్నానని నాగబాబు అన్నారు.


తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర రోడ్లు, భవనాలు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తిరుపతిలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.


రాష్ట్ర యంయస్‌యంఇ, సెర్ప్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీలో తిరుపతిలో జరిగిన దుర్గటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. శ్రీవారి భక్తుల మృతి తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ దుర్ఘటన ఎంతో బాధాకరమని, మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ.. తిరుపతి భక్తుల మరణం పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానన్నారు. పోలీస్, అధికారుల వైఫల్యం, టీటీడీ సమన్వయ లోపం బహిర్గతమవుతుందన్నారు. స్థానిక సీపీఐ కార్యకర్తలు సహాయకార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నానని నారాయణ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హుటాహుటిన తిరుపతి చేరుకున్న మంత్రి అనం

తిరుమలలో పెను విషాదం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 09 , 2025 | 08:54 AM