రేపు తిరుపతికి సీఎం
ABN, Publish Date - Jan 11 , 2025 | 02:07 AM
సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం తిరుపతి పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినానితో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ సీఎం పర్యటించే ప్రాంతాలను తనిఖీ చేశారు. తాజ్ హోటల్‌లో పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా అప్రమత్తంగా అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభంబన్సల్, నగరపాలక కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు, ఆర్డీవో రామమోహన్ పాల్గొన్నారు. కాగా, ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులపాటు జిల్లాలో ఉండనున్నారు.
-నాలుగు రోజులు జిల్లాలో ఉండనున్న చంద్రబాబు
- ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుచానూరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం తిరుపతి పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినానితో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ సీఎం పర్యటించే ప్రాంతాలను తనిఖీ చేశారు. తాజ్ హోటల్‌లో పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా అప్రమత్తంగా అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ శుభంబన్సల్, నగరపాలక కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహులు, ఆర్డీవో రామమోహన్ పాల్గొన్నారు. కాగా, ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులపాటు జిల్లాలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరు ముఖద్వారం (బనీన్‌ఫ్యాక్టరీ) సమీపంలో శంకర్‌రెడ్డి నివాసంలో ఏజీఅండ్‌పీ గ్యాస్ సంస్థ ఇంటింటికి ఏర్పాటు చేసిన గ్యాస్ కనెక్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం 2.20 గంటలకు తాజ్ హోటల్‌కు చేరుకుని, ఏజీ అండ్‌పీ గ్యాస్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడి వరకు అధికారనిక పర్యటన ఖరారైంది. కాగా, సాయంత్రం నారావారిపల్లెకు చేరుకుని పండుగ సందర్భంగా 13, 14, 15 తేదీల్లో చంద్రబాబు అక్కడే ఉంటారు. 15వ తేదీన మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు.
Updated Date - Jan 11 , 2025 | 02:07 AM