5, 6, 7 తేదీల్లో సీఎం పర్యటన
ABN, Publish Date - Jan 01 , 2025 | 01:31 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు 5, 6, 7 తేదీల్లో కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
అధికారులందరూ సన్నద్ధం కావాలన్న కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు 5, 6, 7 తేదీల్లో కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కడా పీడీ వికాస్ మర్మత్ సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్‌లో భాగంగా నడిమూరులో సోలరైజేషన్‌కు సంబంధించి ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్ అధికారులు సర్వే, ఇతరత్రా పనులను పూర్తిచేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, క్షేత్రపరిశీలనకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.ప్రతి శాఖ చేస్తున్న కార్యక్రమాలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు.ఎస్పీ మణికంఠ, జేసీ విద్యాధరి, డీఎ్‌ఫవో భరణి, డీఆర్వో మోహన్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ విజయ్‌కుమార్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్, పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర రెడ్డి, జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డ్వామా పీడీ రవికుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, హౌసింగ్ పీడీ పద్మనాభం, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్, డీఎంహెచ్‌వో సుధారాణి, డీసీహెచ్‌ఎ్‌స ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 01 , 2025 | 01:31 AM