రంకేసిన కోడెగిత్తలు
ABN, Publish Date - Feb 10 , 2025 | 01:10 AM
వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జల్లికట్టు జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి కోడెగిత్తలను తీసుకొచ్చారు. జనం కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోడెగిత్తల కొమ్ములకు పట్టీలను కట్టి అల్లిలోకి వదిలారు. పలువురు యువకులు వీటిని నిలువరించడానికి పోటీ పడ్డారు. కొందరికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ సన్నివేశాలను మేడలు, గోడలు ఎక్కి జనం వీక్షించారు.

- పాతగుంటలో జల్లికట్టు
వెదురుకుప్పం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జల్లికట్టు జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి కోడెగిత్తలను తీసుకొచ్చారు. జనం కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోడెగిత్తల కొమ్ములకు పట్టీలను కట్టి అల్లిలోకి వదిలారు. పలువురు యువకులు వీటిని నిలువరించడానికి పోటీ పడ్డారు. కొందరికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ సన్నివేశాలను మేడలు, గోడలు ఎక్కి జనం వీక్షించారు.
అపశ్రుతి
చంద్రగిరి మండలం దోర్నకంబాలకు చెందిన శ్రీనాథరెడ్డి(39) తన స్నేహితులతో కలసి పాతగుంటలో జరిగిన జల్లికట్టుకు హాజరయ్యాడు. ఫూటుగా మద్యం తాగి మధ్యాహ్నం మూడు గంటలపైన తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులతో కలిసి బ్రాహ్మణపల్లె సమీపంలో ఉన్న ఓ చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో చెరువులో గల్లంతయ్యాడని ఊరంతా తెలిసింది. వెదురుకుప్పం పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. అగ్నిమాపక కేంద్ర సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి సుమారు రాత్రి 8గంటల సమయంలో శ్రీనాథరెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 01:10 AM