Share News

నేడు సీపీటీ పరీక్షలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:47 AM

జిల్లాలో శనివారం నుంచి జరగనున్న ఏపీపీఎస్సీ కంప్యూటర్‌ - కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు(సీపీటీ)కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు.

నేడు సీపీటీ పరీక్షలు

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం నుంచి జరగనున్న ఏపీపీఎస్సీ కంప్యూటర్‌ - కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్టు(సీపీటీ)కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. పుత్తూరులోని వెంకటేశ పెరుమాల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో శని, ఆదివారాలు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. 600 మంది హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసరావు, రామాజీ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 01:47 AM